ఆమె పేరు లిపి.. వయస్సు 27 ఏళ్లు.. లా చదువుతుంది.. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో ఇల్లు.. అమ్మ IAS.. నాన్న కూడా IAS.. అమ్మానాన్నలు ఇద్దరూ మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖల్లో పని చేస్తున్నారు. ఇద్దరూ సీనియర్ IASలు.. వీరి కుమార్తె లిపి.. తాను నివాసం ఉండే హైరైజ్ టవర్ లోని 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది లిపి.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటన.. లిపి ఆత్మహత్యకు కారణాలు ఏంటీ అనేది ఆసక్తిగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
లిపి సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో చదువుకుంది. కంటెంట్ రైటర్ గా కొంతకాలం, బ్యూటీ కన్సల్టెంట్ గా కూడా లిపి పని చేసింది. యూనిలివర్, నైకా వంటి పెద్ద కంపెనీల్లో మార్కెటింగ్ స్ట్రీమ్ లో కూడా వర్క్ చేసింది. తర్వాత ఆమె OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి లా చదివింది. దక్షిణ ముంబైలోని మంత్రాలయ ఏరియాలో ఓ బిల్డింగ్ లో నివాసం ఉంటుంది. జూన్ 3 (సోమవారం) తెల్లవారుజామున 4గంటలకు లిపి 10 అంతస్తుల భవనం నుంచి దూకి చనిపోయింది.
సూసైడ్ స్పార్ట్ లో పోలీసులకు ఓ లెటర్ దొరికింది. అందులో ఆమె చావుకు ఎవరు కారణం కాదని రాసింది. తానంతట నానే ఆత్మహత్య చేసుకున్నట్లు దీనికి ఎవరు బాధ్యులు కారని తెలిపింది. దీంతో కఫ్ పరేడ్ పోలీసులు లిపిది అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం లిపి హర్యానాలోని సోనిపట్‌లో ఎల్‌ఎల్‌బి చదువుతుంది. చదువులో ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు బావిస్తున్నారు.