ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి.ప్రశాంతిని అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎం.విజయ సునీతను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు...మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా ఉన్న సుమిత్ కుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు..
సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్న జి. వీరపాండ్యన్‌కు డైరెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.. మరోవైపు ఐఎఫ్‌ఎస్ అధికారి రాహుల్ పాండ్యేకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.