ఐఏఎస్ అధికారి భార్య ఆత్మహత్య.. కారణం అదేనా?

ఐఏఎస్ అధికారి భార్య ఆత్మహత్య.. కారణం అదేనా?

చెన్నయ్: గ్యాగ్ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య ఆత్మహత్య చేసుకుంది. గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీ కమిషన్ లో  సెక్రటరీ హోదాలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి గాంధీనగర్  సెక్టార్ 19లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య 2023లో తన స్వస్థలమైన తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌స్టర్ హైకోర్టు మహా రాజా‌తో పారిపోయినట్టుగా తెలుస్తోంది.

 విషయం తెలుసుకున్న సదరు ఐఏఎస్ అధికారి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో తన వద్ద నుంచి వెళ్లిపోయిన భార్యను తన ఇంట్లోకి రానివ్వొద్దని ఐఏఎస్ అధికారి సహాయకులకు సూచించారు. అయితే, శనివారం మహిళ అధికారి నివాసానికి చేరుకుంది. కానీ, సిబ్బంది ఆమెను లోనికి రానివ్వలేదు. దీంతో, భవనం ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

 ఆమెను గాంధీనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఓ బాలుడిని కిడ్నాప్ కేసులోని అధికారి భార్య ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ హైకోర్టు మహారాజా, అతని సహాయకుడు సెంథిల్ ఓ బాలుడ్ని జులై 11న కిడ్నాప్ చేశారు. అతడ్ని వదలిపెట్టేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేయగా.. బాలుడిని కాపాడారు. ఈ కేసులో అధికారి భార్యకు కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.