సీఎం ప్రిన్సిపల్​..సెక్రటరీగా శేషాద్రి

సీఎం ప్రిన్సిపల్​..సెక్రటరీగా శేషాద్రి

హైదరాబాద్, వెలుగు : సీఎం ప్రిన్సిపల్​ సెక్ర టరీగా శేషాద్రిని నియమిస్తూ సీఎస్​ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్​ చీఫ్​గా అదనపు డైరెక్టర్​ జనరల్​శివధర్​ రెడ్డిని నియమించారు.

కేసీఆర్​ ప్రభుత్వంలోనూ శేషాద్రి కొంత కాలం సీఎం సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) సెక్రటరీగా ఉన్నారు. శేషాద్రికి అనుభవంతో పాటు నిజాయితీ కలిగిన ఆఫీసర్ గా పేరుంది.