అందరిపై చర్యలు ఉంటాయా..? కంచె గచ్చిబౌలి ఇష్యూపై IAS స్మితా మరో ట్వీట్

అందరిపై చర్యలు ఉంటాయా..? కంచె గచ్చిబౌలి ఇష్యూపై IAS స్మితా మరో ట్వీట్

హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో క్రియేట్ చేసిన ఫేక్ ఫొటోలను సోషల్ మీడియా (ఎక్స్)లో సర్క్యూలేట్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‎కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీపోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఫొటోలకు సంబంధించిన సమాచారం అందించాలని పేర్కొంటూ బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు. తాజాగా పోలీసుల నోటీసులపై ఆమె స్పందించారు. 

పోలీసులకు పూర్తిగా సహకరించి.. నోటీసులకు వివరణ ఇచ్చానని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ‘‘కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూలో పోలీసులకు పూర్తిగా సహకరించా. పోలీసుల నోటీసులకు వివరణ ఇచ్చాను. తాను రీ ట్వీట్ చేసిన పోస్టుపై రెండువేల మంది స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే. సహజ న్యాయ సూత్రాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మరీ అందరిపై సమాన చర్యలు ఉంటాయా..?’’ అని ప్రశ్నించారు స్మితా సబర్వాల్. కొంతమందిని మాత్రమే టార్గెట్‎ చేసి నోటీసులు ఇస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. 

►ALSO READ | అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ: సీఎం రేవంత్

కాగా, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీయూ మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు, నెమలి, జింకలు ఉన్నట్లుగా మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఫొటోను ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు క్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఏఐ వీడియోలు, ఫొటోలతో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం జరిగింది. దీని వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రాథమిక ఆధారాలతో ఎక్స్ సహా సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా హ్యాండ్లర్లు, యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. 

ఇందులో భాగంగానే స్మితకు నోటీసులు ఇవ్వగా.. పోలీసులకు సమన్లుకు ఆన్సర్ ఇచ్చిన ఆమె.. అందరిపై చర్యలు ఉంటాయా..? అంటూ ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న స్మిత తీరు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందనే చర్చ నడుస్తోంది. దీంతో స్మిత వ్యాఖ్యలపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.