
ఐటీ సెక్టార్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఐటీ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్, అకా IBM కంపెనీ వర్క్ ఫోర్స్ను తగ్గించేందుకు సిద్దమవుతోంది. యూఎస్లోని వివిధ లోకేషన్లలో పనిచేస్తున్న దాదాపు 9వేల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ తన క్లౌడ్ క్లాసిక్ వర్క్ ఫోర్స్లో నాలుగో వంతు మందిని తొలగించే అవకాశం ఉంది.
ఐబీఎంలో ఈ విభాగాల వారే..
ఐబీఎం కంపెనీ తన క్లౌడ్ క్లాసిక్ వర్క్ ఫోర్స్ లో నాలుగో వంతు ఉద్యోగులను తొలగించనుంది. రాలి, న్యూయార్క్, డల్లాస్, కాలిఫోర్నియాలోని 9వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం ఉందని తెలుస్తోంది. కన్సల్టింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్, సేల్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫరింగ్స్, ఐబీఎం సీఐఓకు రిపోర్ట్ చేసి అంతర్గత వ్యవస్థలపై పనిచేసే వ్యక్తులు ఈ లే ఆఫ్ ల ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. క్లౌడ్ గ్రూపులో 10 శాతం ఉద్యోగులకు వారి తొలగింపునకు సంబంధించి ఇప్పటికే సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
తొలగింపునకు కారణం..
ఐబీఎం 2013లో సాఫ్ట్ లేయర్ ను కొనుగోలు చేసిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్-ఆస్-ఏ-సర్వీస్ (ఐఏఏఎస్) సంస్థ ఐబీఎం క్లౌడ్ క్లాసిక్ లో ఉద్యోగుల తొలగింపునకు ఒక కారణమని తెలుస్తోంది. టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ అండ్ స్టేట్, డల్లాస్, టెక్సాస్, నార్త్ కరోలినాలోని రాలీ వంటి ప్రాంతాల్లో ఐబీఎం ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశం ఉంది. భారత్ లో పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐబీఎంకు భారీ ఆఫీస్లు ఉన్నాయి.