న్యూఢిల్లీ: క్లౌడ్ ఆటోమేషన్‌లో తన సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో భాగంగా క్లౌడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ యాప్టియోను విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ నుండి 4.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు ఐబీఎం సోమవారం తెలిపింది. 2023 చివరినాటికి ఒప్పందం ముగుస్తుందని కంపెనీ తెలిపింది. చాలా ఐటీ కంపెనీలు టెక్నాలజీబడ్జెట్లను తగ్గించుకుంటున్న సమయంలో ఐబీఎం ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
ALSO READ:హైకోర్టు చెప్పినా.. సర్కార్ బేఖాతర్
యాప్టియోకు1,500 మంది కస్టమర్లతోపాటు అమెజాన్ఏడబ్ల్యూఎస్, సేల్స్‌ఫోర్స్ వంటి క్లౌడ్ కంపెనీలతో పార్ట్నర్షిప్లు ఉన్నాయి. యాప్టియోతో తమ రెడ్‌హాట్ వ్యాపారం, ఏఐ పోర్ట్‌ఫోలియో, కన్సల్టింగ్ వ్యాపారాలకు మేలు జరుగుతుందని ఐబీఎం తెలిపింది.