టాలీవుడ్ నిర్మాతలకు ఐబొమ్మ గట్టి వార్నింగ్

హై క్వాలిటీ అండ్ లేటెస్ట్ మూవీస్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో నిలిచే ఐ బొమ్మ నిర్వాహకులు.. టాలీవుడ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దర్శక, నిర్మాతలను హెచ్చరిస్తూ విడుదల చేసిన ఈ నోట్ లో.. ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా.. అది మీ కొడుకు అయినా ఎవరైనా.. అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో పని చేసే వారికి ఏ కూలీ పని చేసినా ఆ డబ్బులొస్తాయి. . కానీ మీ హీరోకి, హీరోయిన్ కి అంత డబ్బు వస్తుందా అని ప్రశ్నించారు.

సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్, విదేశాల్లో షూటింగ్ లకు, ట్రిప్స్ కు ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు. ఇండియాల షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా.. అక్కడ వాళ్లకి ఉపాధి కలుగుతుంది కదా అని చెప్పారు. మా వెబ్ సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది హెచ్చరించారు. తాము ibomma.net వాళ్లంత మంచోళ్ల కాదని.. బురదలో రాయి వేయకండి.. అది కూడా పెంట మీద అస్సలు వేయకండని నోట్ లో తెలిపారు. తాము ఏ దేశంలో ఉన్నా భారతదేశం.. అందులోనూ తెలుగు వాని కోసం ఆలోచిస్తామని స్పష్టం చేశారు. చివర్లో చావుకు భయపడని వాడు దేనికీ భయపడడు అంటూ ఓ పవర్ ఫుల్ స్లోగన్ కూడా జోడించారు.

Also Read :- జవాన్.. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ నోట్.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. అయితే ఈ నోట్ ను నిజంగానే ఐబొమ్మ వాళ్లు రిలీజ్ చేశారా.. లేదంటే ఆ పేరుతో ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారా అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏదేమైనా ఈ తరహా నోట్.. ఇప్పుడు నిర్మాతలను భయపెట్టేదిగానే ఉందని అంతా చర్చించుకుంటున్నారు.