
- ఐబీపీఎస్ క్లర్క్స్,ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ స్పెషల్
ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగే సెక్షన్ రీజనింగ్. క్వశ్చన్‌లో లాజిక్ పట్టుకోగలిగితే ఆన్సర్ చేయడం ఈజీ. అలాంటి రీజనింగ్ చాప్టర్స్‌ను ఎలా ప్రిపేరవ్వాలి? ఏయే టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలొచ్చే చాన్స్ ఉంది? వేగం.. కచ్చితత్వం ఏలా సాధించాలనే అంశాలపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఈ వారం..
ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో రీజనింగ్ సెక్షన్ కు సంబంధించి 20 నిమిషాల్లో 35 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 0.25 కోత ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ పరిశీలిస్తే సిలాగిజమ్ (3–5 ప్రశ్నలు), డైరెక్షన్& డిస్టాన్స్(2-–3), సీటింగ్ అరేంజ్మెంట్ & ఫజిల్స్(15–20), ఇనీక్వాలిటీ(2–3), ఆల్ఫాబెట్& ఆల్ఫా న్యూమెరిక్ సింబల్ సీక్వెన్స్(3–5), కోడింగ్ & డికోడింగ్(2–4), ఆర్డర్ & ర్యాంకింగ్(2–3) అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలొస్తున్నాయి. ఎగ్జామినర్ ఇచ్చే ప్రశ్నను జాగ్రత్తగా చదివి, అందులో ఉన్న లాజిక్‌ను పట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. మిగతా సబ్జెక్టుల్లోగా రీజనింగ్ టాపిక్స్ మధ్య ఇంటర్ లింక్ ఉండదు. అన్నీ ఇండిపెండెంట్ అంశాలే. ప్రతి చాప్టర్లోని కాన్సెప్ట్‌లను క్షుణ్ణంగా పూర్తి చేసిన తర్వాత మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేస్తే బాగా యూజ్ ఉంటుంది. ఎగ్జామ్‌లో ఈజీ, తక్కువ సమయం తీసుకునే సమస్యలతో మొదలుపెట్టి లెన్తీ, డిఫికల్ట్ ప్లాబ్లమ్స్ వైపు వెళ్లాలి. వేగం, కచ్చితత్వంల మధ్య సమన్వయం సాధిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను స్కోర్ చేయొచ్చు. అందుకు ప్రాక్టీస్ చాలా ముఖ్యం.
సీటింగ్ అరేంజ్మెంట్& ఫజిల్: సీటింగ్ అరెంజ్మెంట్స్ & ఫజిల్ టాపిక్ ఇంపార్టెంట్. ఇందులో ఒక్కో సెట్లో 5 ప్రశ్నలు ఉండేలా 3 నుంచి 4 సెట్లు వస్తాయి. సర్క్యులర్, రో, అన్సర్టేయిన్, బాక్స్, ఫ్లోర్, ఫ్లాట్ + ఫ్లోర్, డే/మంత్/ఇయర్, 3 వేరియేబుల్స్ తదితర రకాల సమస్యలు వస్తాయి. స్టేట్మెంట్లోని డైరెక్ట్ ఇన్ఫర్మేషన్తో ప్రశ్నను బట్టి ఒక డయగ్రామ్ గీసి సమాచారాన్ని అందులో పొందుపరచాలి. చివరగా ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ను జాగ్రత్తగా అందులో సరిపోయేటట్లు అమరిస్తే సమస్య పూర్తవుతుంది.
EX: Study the information and answer the questions
There are seven persons i.e A, B, C, D, E, F & G. They all belongs to different cities i.e Kolkata, Mubai, Chennai, Pune, Lucknow, Ahmedabad & Delhi but necessarily in the same order. D belongs to Pune, Neither A nor F belongs to Kolkata. B belongs Ahmedabad. C does not belongs to Kolkata & Lucknow. G belongs to Mumbai. A does not belongs to Lucknow & Chennai
Q:. Who among the following belongs to Kolkata ?
. a) A b) D c) F d) G e) None of these
రక్త సంబంధాలు: బ్లడ్ రిలేషన్స్ టాపిక్కు సంబం ధించి విభిన్న సంబంధాలకు భిన్న గుర్తులను ఉపయోగించి ఫ్యామిలీ ట్రీ గీస్తే ప్రశ్న ఏరకంగా ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సమస్య సాధన క్రమంలో కన్ఫ్యూజన్ రాకుండా ‘+’ ను మగవారిగా, ‘–’ ను ఆడవారిగా, ‘<=>’ ను భార్యాభర్తలుగా, ‘<–>’ సోదరీ సోదరులుగా రిలేషన్స్ సూచించడానికి ఉపయోగిస్తారు.
EX: Study the information and answer the questions
There are seven members in a family of 3 generations. A is mother of P. P is brother of G. K is married to G. S is aunt of M. K is child of L. S is sister of K
Q:. How S is related to G ?
. a) Sister b) Sister in law
. c) Aunt d) Mother in law
. e) None
డైరెక్షన్ & డిస్టాన్స్: డైరెక్షన్ & డిస్టాన్స్ సెక్షన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి దిక్కులు, క్లాక్ వైజ్ & యాంటి క్లాక్‌వైజ్ డైరెక్షన్, కోణాలు, ఫైథాగరస్ సిద్ధాంతంపై అవగాహన ఉండాలి. అందుకు సిలబస్‌లో ఇచ్చిన ప్రతి టాపిక్‌ను క్షుణ్నంగా చదవాలి.
సిలాగిజమ్: రీజనింగ్ సెక్షన్ కు సంబంధించి సిలాగిజమ్ చాప్టర్లో 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే చాన్స్ ఉంది. వెన్ డయాగ్రామ్‌లను ఉపయోగించి సిలాగిజమ్ సమస్యలు సాధిస్తే కరెక్ట్ ఆన్సర్ పట్టుకోవచ్చు. ఇచ్చిన అన్ని స్టేట్మెంట్లను జాగ్రత్తగా చదివి కన్‌క్లూజన్స్ వాటికి సరిపోతాయో లేదో పోల్చుకోవాలి.
EX: Answer the fallowing
. a) If only I follows
. b) If only II follows
. c) Either I or II follows
. d) Neither I nor II follows
. e) Both I&II follows
Statement:
. All Tennis is Football
. All Football is Basketball
. No Basketball is Cricket
Conclusion:
. I No Football is Cricket
. II All tennis is Foot ball
ఇన్‌ఈక్వాలిటీ: ఈ సమస్యలు సాధించడానికి >, ³ లేదా <, £ ల మధ్య ప్రాధాన్యతాక్రమం గుర్తించాలి.
Ex: Which of the following will be definitely true for
T³U³M=N . a) T . c) R>N d) R³M e) T
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ(సీబీటీ–1) ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్‌కు సంబంధించి సీబీటీ–1లో రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలొస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. తప్పు సమాధానానికి వన్ థర్డ్ మార్క్ కోత విధిస్తారు. ఎన్టీపీసీ ఎగ్జామ్‌లో రీజనింగ్ సెక్షన్‌కు సంబంధించి వేగం కంటే కచ్చితత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. అనాలజీ & క్లాసిఫికేషన్(3–5 ప్రశ్నలు), కోడింగ్ & డికోడింగ్(3–4), వెన్డయాగ్రామ్స్(2–3), బ్లడ్ రిలేషన్స్(2–3), సిలాగిజమ్(2–3), మ్యాథమెటికల్ ఆపరేషన్స్(2–4), సీటింగ్ అరేంజ్మెంట్స్ & ఫజిల్స్(3–4), సిరీస్(2–3), స్టేట్మెంట్– కన్‌క్లూజన్ & అజ్యంప్సన్స్ (2–4), మిస్సింగ్ నెంబర్స్(1–2), క్లాక్స్ & క్యాలెండర్స్ (0–2), క్యూబ్స్ & డైస్(1–2) టాపిక్స్ నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిలో అనాలజి & క్లాసిఫికేషన్, కోడింగ్ & డికోడింగ్ చాప్టర్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని బాగా ప్రిపేరవ్వాలి. మోడల్ క్వశ్చన్స్ 1.. పరీక్ష: విజయం:: ఆట:……….. . a) క్రికెట్ b) తయారు . c) ప్రయత్నం d) గెలుపు 2.. కిందివానిలో విభిన్నంగా ఉన్నది…….? . a) I b) N c) V d) H 3.. 6, 12, 32, 42 ,56, 72 శ్రేణిలో తప్పుడు సంఖ్య ఏది? . a) 20 b) 56 c) 72 d) 32 4.. ఒక కోడ్ భాషలో UNGIMMICKYL ను MIGNUYKCIM గా రాస్తే అదే భాషలో COMPLEXITY ను ఎలా రాస్తారు? . a) LPMOOCYTIXE . b) LPMOYCTIXE . c) LPOMCYTIXE . e) LPMOCYTIXE 5.. (14*9*6)*15*8 లోని * స్థానంలో ఏ గణిత గుర్తులను వరుస క్రమంలో అనుసరిస్తే సమీకరణం సరైనది అవుతుంది? . a) ÷, –, =, x b) x, –, ÷,= . c) x, =, ÷, –, d) –, ÷, x, = 6.. కింది వెన్‌చిత్రంలో P మాంసాహార, Q మొక్కలు, R పచ్చనివి సూచిస్తే.. మాంసాహార మొక్కలు పచ్చనివి కానివి ఏవి? . a) d b) g c) e d) f