నెలల తరబడి బ్యాంక్ కొలువులకు సిద్ధమవుతున్న వారికి ఐబీపీఎస్ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ బ్యాంక్ జాబ్లకు పరీక్షలు నిర్వహించే ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో 9,995 అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. దాదాపు ఒకే సిల బస్ కావడంతో ఒకే ప్రిపరేషన్‌తో, ఓరియంటేషన్ మార్చి చదివితే ఏదో ఒక జాబ్ సొంతం చేసుకునే అవకాశం ఇది.
ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టిపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్–I, ఆఫీసర్ స్కేల్–II (అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, లా ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఐటీ, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్), ఆఫీసర్ స్కేల్–III పోస్టులను భర్తీ చేస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్: మల్టి పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు తప్ప మిగిలిన అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష 45 నిమిషాలకు, మెయిన్ ఎగ్జామ్ రెండు గంటలకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీలో ఇస్తారు. అన్ని దశల్లో నెగెటివ్ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి ¼ మార్కు మైనస్ అవుతుంది.
సిలబస్
జనరల్ అవేర్‌నెస్: కరెంట్ అఫైర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగంలో పరిణామాలు, మానిటరీ పాలసీ, రుణాలు, వడ్డీ రేట్లు, ఫైనాన్స్ అంశాల గురించి తెలుసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ముఖ్యమైన ఘటనలు, వ్యక్తుల గురించి అవగాహన ఉండాలి.
ఆప్టిట్యూడ్/డేటా ఇంటర్‌ప్రిటేషన్: అర్థమెటిక్ అంశాలు, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటాఇంటర్‌ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ అంశాలపై ఫోకస్ చేయాలి. వేగం, కచ్చితత్వంతోనే మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉండడంతో ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
ప్రొఫెషనల్ నాలెడ్జ్: అభ్యర్థులు తమ అకడమిక్ అర్హతలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకుంటే ఇందులో ఎక్కువ స్కోర్ చేయవచ్చు.
రీజనింగ్: కోడింగ్, డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, పజిల్స్, ఇన్–ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్స్, ఆల్ఫాబెటికల్ సీక్వెన్సెస్, సిలాజిజమ్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇన్‌పుట్–అవుట్‌పుట్స్ తదితర అంశాలపై ఫోకస్ చేయాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్: గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై పట్టు సాధించాలి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డైలీ చదవడంతో వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు.
కంప్యూటర్ నాలెడ్జ్: ఇందులో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ (కీ బోర్డ్ షార్ట్ కట్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితర అంశాలు) గురించి తెలుసుకోవాలి.
ఫైనాన్షియల్ అవేర్‌నెస్: తాజా బ్యాంకింగ్ రంగ పరిణామాలు, బ్యాంకింగ్ వ్యవస్థ విధానాలు, ఆర్థిక రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అవగాహన ఉండాలి.
స్పెషలైజ్డ్ సబ్జెక్టులు
బ్యాంకింగ్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్
ఈ సెక్షన్ లో ఫైనాన్షియల్ మార్కెట్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, బ్యాంక్‌ఎస్యూరెన్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, మనీ మార్కెట్స్, మనీ ఫంక్షన్స్ అండ్ టైప్స్, బ్యాంక్ లోన్స్ అండ్ డిపాజిట్స్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, స్ర్టక్చర్ ఆఫ్ బ్యాంకింగ్, రీటెయిల్ బ్యాంకింగ్, బ్యాంక్ టెర్మ్స్, బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఆర్బీఐ, నాబార్డ్, బ్యాంకింగ్ కమిటీలు, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఈ పేమెంట్ సిస్టమ్స్ వంటి కొన్ని వందల టాపిక్‌ల నుంచి ప్రశ్నలిస్తారు.
కంప్యూటర్ నాలెడ్జ్: బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ విస్తరించడంతో ప్రతి ఉద్యోగికి కంప్యూటర్ వినియోగం తప్పనిసరయింది. కాబట్టి అభ్యర్థికి కంప్యూటర్స్ పై ఉన్న బేసిక్ నాలెడ్జ్‌ను టెస్ట్ చేసేలా ప్రశ్నలిస్తారు. కంప్యూటర్ల పరిచయం, వాటి చరిత్ర, కంప్యూటర్ టెర్మినాలజీ, కంప్యూటర్ మెమొరీ, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మొబైల్ అప్లికేషన్స్, ఎక్సెల్, వైరస్, యాంటీవైరస్, మొబైల్ టెక్నాలజీ, వెబ్‌సైట్స్, యాప్స్, యూఆర్ఎల్స్ వంటి విస్తృత టాపిక్‌ల నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది.
అగ్రికల్చర్: ఇందులో అగ్రికల్చర్, సీడ్స్, సాయిల్, యానిమల్ హజ్బెండరీ, క్రాప్ అండ్ సీడ్ వెరైటీస్, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, ప్లాంట్స్, ఫ్రూట్స్, కల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, సాయిల్ టైప్స్, గ్రీన్ మ్యాన్యూర్స్, యానిమల్ వెరైటీస్ అండ్ బ్రీడ్స్, అగ్రికల్చర్ ఇండస్ర్టీస్, కాటేజస్, యానిమల్ డిసీజెస్ అండ్ ఇట్స్ కాజెస్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి పథకాలు వంటి అగ్రికల్చర్ రిలేటెడ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఇండస్ర్టీతో ముడిపడి ఉన్న అగ్రికల్చర్ లోన్ సిస్టమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ టాపిక్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
మార్కెటింగ్:ఈ విభాగంలో మార్కెటింగ్ పరిచయం, స్ర్టాటజీస్, ప్లానింగ్, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, కన్స్యూమర్ బిహేవియర్, బి2బి మార్కెటింగ్, సర్వీస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, బ్రాండింగ్, మార్కెటింగ్ చానల్స్, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, పర్సనల్ సెల్లింగ్ వంటి టాపిక్‌ల నుంచి ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్ ఇండస్ర్టీలో వస్తున్న మార్పులు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ గమనించాలి.
లా: ఇందులో బ్యాంకింగ్ చట్టాలు, నెగోషియబుల్ ఇన్‌స్ర్టుమెంట్స్ యాక్ట్స్, అగ్రికల్చర్ చట్టాలతో పాటు వినియోగదారుల చట్టాలు, పోరమ్స్, కంపెనీ యాక్ట్, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్, మనీలాండరింగ్ యాక్ట్, ఐటీ చట్టం 2000, ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్, టైప్స్ అఫ్ కంపెనీస్, పార్ట్నర్షిప్ యాక్ట్ వంటి లా రిలేటెడ్ అంశాను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
ప్రిపరేషన్ ప్లాన్: ముందుగా ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలో ఒక ప్రణాళికను తయారుచేసుకోవాలి. దాని ప్రకారమే సన్నద్ధతను కొనసాగించాలి. ప్రిలిమ్స్ పరీక్ష ల్లో ఉండే ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లకే ఎక్కువ సమయం అవసరం అవుతుంది. రోజులో ఎక్కువ సమయాన్ని వీటికే కేటాయిస్తూ, కొంత సమయం మెయిన్స్‌లో ఉండే ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్‌లకు కూడా కేటాయించాలి.
ఆప్టిట్యూడ్‌లో దాదాపుగా 20 టాపిక్స్, రీజనింగ్‌లో 15 టాపిక్స్ ఉంటాయి. వీటన్నింటిపై పూర్తి పట్టు సంపాదించాలి. రోజూ రెండు సబ్జెక్టుల్లో ఒక్కో టాపిక్ పూర్తిచేయాలి. ఆపై వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. టాపిక్స్ మొత్తం పూర్తి కావడానికి దాదాపు 20- నుంచి 25 రోజుల సమయం పడుతుంది. ప్రశ్నలను సాధించడానికి ఎంత సమయం పడుతుందో కూడా గమనిస్తూ ఉండాలి. ఎక్కువ సమయం తీసుకునే టాపిక్స్‌లోని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగుతోందో తెలుసుకోగలిగేది మాదిరి ప్రశ్నపత్రాలు రాయడం ద్వారా మాత్రమే. ఏయే ప్రశ్నలు సాధించగలుగుతున్నారో, వేటికి ఎక్కువ సమయం పడుతుందో, ఏవి సాధించాలో, ఏవి వదిలివేయాలో మొదలైనవన్నీ మాదిరి ప్రశ్నల ద్వారా మాత్రమే తెలుస్తాయి.
నోటిఫికేషన్
ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితరాలు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్షలు: ఆగస్టు 3, 4, 10, 17, 18 వ తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ సెప్టెంబర్ 29, అక్టోబర్ 6న నిర్వహించనున్నారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో సంప్రదించాలి.