దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆఫీసర్ స్కేల్ I, II, III మరియు ఆఫీస్ అసిస్ట్ (మల్టీపర్పస్) వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 9,995
విభాగాలు: క్లర్క్, ఆఫీసర్ స్కేల్ -1, 2 & 3
పాల్గొనే బ్యాంకులు: 43
వయోపరిమితి:
ఆఫీసర్ స్కేల్- I: 01/06/2024 నాటికి 18 నుండి 30 ఏళ్లలోపు వారు అర్హులు.
ఆఫీసర్ స్కేల్- II: 01/06/2024 నాటికి 21 నుండి 32 ఏళ్లలోపు వారు అర్హులు.
ఆఫీసర్ స్కేల్- III: 01/06/2024 నాటికి 21 నుండి 40 ఏళ్లలోపు వారు అర్హులు.
ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్): 01/06/2024 నాటికి 18 నుండి 28 ఏళ్లలోపు వారు అర్హులు. నిబంధనల ప్రకారం SC/ST/OBC/ PH/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
విద్యార్థతలు:
విభాగాలను బట్టి విద్యార్థతలు వేరువేరుగా ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దాని సమానమైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే ఆఫీసర్ కేడర్ పోస్టులకు డిగ్రీ, CA, MBA వంటి ఉత్తీర్ణత ఉండాలి. స్కేల్-II, III పోస్టులకు సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవలెను).
దరఖాస్తు ఫీజు: SC/ST/PWBD అభ్యర్థులకు : రూ.175.. ఇతరులకు రూ.850గా నిర్ణయించారు.
పరీక్ష మోడ్: ఆన్‌లైన్
నియామక ప్రక్రియ:
- ఆఫీసర్ స్కేల్ 1: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ
- ఆఫీస్ అసిస్టెంట్: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్
- ఆఫీసర్ స్కేల్ 2 & 3: ఒకే పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 7 జూన్ 2024
- దరఖాస్తులకు చివరి తేదీ: 27 జూన్ 2024