RRB Clerk మెయిన్స్ అడ్మిట కార్డు రిలీజ్.. డౌన్ లోడ్ చేసుకోండిలా

RRB Clerk మెయిన్స్ అడ్మిట కార్డు రిలీజ్.. డౌన్ లోడ్ చేసుకోండిలా

RRB క్లర్క్ మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థుల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.6 అక్టోబర్ 2024న RRB క్లర్క్ మెయిన్స్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అభ్య ర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను అందించిన లింక్ నుండి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. BPS RRB క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్టులను దాని అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో పొందవచ్చు. ప్రిలిమ్స్ దశలో పాస్ అయిన అభ్యర్థుుల ఇప్పుడుIBPS అధికారిక వెబ్ సైట్ నుంచి వారి మెయిన్స్ కాల్ లెటర్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశమంతటా వివిధ గ్రామీణ బ్యాంకుల (RRB) లో ఆఫీస్ అసిస్టెంట్ ( క్లర్క్) పోస్టుల భర్తీకోసం ఈ మెయిన్స్ పరీక్ష కీలకం. 

IBPS RRB క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా?

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.ibps.inలో IBPS అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. 
  • అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి. హోమ్‌పేజీలో, తాజా నోటిఫికేషన్‌ల క్రింద IBPS RRB క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024 అని ఉన్న లింక్ కోసం చూడండి.
  • లాగిన్ చేయడానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. 
  • విజయవంతమైన లాగిన్ తర్వాత, మీ అడ్మిట్ కార్డ్ డిస్ ప్లే అవుతుంది. డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.