సైఫ్ కొడుకు హీరోగా.. శ్రీదేవి కూతురు హీరోయిన్ గా నదానియన్ మూవీ

సైఫ్ కొడుకు హీరోగా.. శ్రీదేవి కూతురు హీరోయిన్ గా నదానియన్ మూవీ

సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.  శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ అతనికి జంటగా నటిస్తోంది. శనివారం ఈ మూవీ టైటిల్‌‌ను రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.  ‘నదానియన్‌‌’ అనే టైటిల్‌‌తో ఈ లవ్ స్టోరీ వస్తోంది. ఫస్ట్ లుక్‌‌లో ఇబ్రహీం, ఖుషీ జంట కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

షాన గౌతమ్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా,  సోనేం మిశ్రా కలిసి నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌‌ఫ్లిక్స్‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.