ఆఫ్గన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అనగాన.. ఆ.. ఏముందీ.. పిల్లలపై బ్రహ్మాస్త్రం అనుకున్నారు.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్ జట్టు.. చుక్కలు చూపించింది. అఫ్గన్ బ్యాటర్లను ఔట్ చేయటానికి నానా తంటాలు పడ్డారు ఆసీస్ బౌలర్లు. ఆఫ్గన్ బ్యాటర్ ఇబ్రహీం అయితే ఏకంగా సెంచరీ చేశాడు. 130 బంతుల్లో.. వంద పరుగులు చేశాడు. ఇబ్రమీం జద్రాన్ ను ఔట్ చేయటానికి నానా తంటాలు పడింది ఆసీస్ జట్టు.
ఈ వరల్డ్ కప్ ప్రారంభంలో అంతగా ఫామ్ లో లేని జద్రాన్.. చివరి రెండు మ్యాచ్ ల్లో మంచి ప్రదర్శన చేసి గాడిలో పడ్డాడు. ఇదే జోరును కొనసాగిస్తూ కంగారులపై సమర్ధవంతంగా ఎదుర్కొని సెంచరీ బాదేశాడు. జద్రాన్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. వరల్డ్ కప్ లో ఏ ఒక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సెంచరీ కొట్టడం ఇదే తొలిసారి కావడం. దీంతో జద్రాన్ ఆఫ్ఘన్ క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇబ్రహీం సెంచరీతో ఆఫ్ఘనిస్థాన్ ఈ మ్యాచ్ లో ఆసీస్ కు గట్టి పోటీనిస్తుంది. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రస్తుతం 45 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది జద్రాన్ 108 పరుగులతో నబీ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
Jersey no.18 ho aur selfish na ho? ?#AUSvsAFG pic.twitter.com/70VBpvglBk
— Hamxa ??? (@hamxashahbax21) November 7, 2023