వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ అదరగొట్టేస్తుంది. ప్రత్యర్థి ఏదైనా వరుసగా విజయాలను సాధిస్తుంది. ఈ మెగా టోర్నీలో వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను ఓడించిన ఆఫ్గాన్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మీద జరుగుతున్న మ్యాచ్ లో గట్టి పోటీనిస్తుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ తీసుకోగా..నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.
ఇబ్రహీం జద్రాన్ రికార్డ్ సెంచరీ చేసాడు. 143 బంతుల్లో..129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వంద పరుగులు పూర్తి చేసుకున్న జద్రాన్ వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. జద్రాన్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఈ ఓపెనర్ కు తోడు రహ్మత్ షా 30, కెప్టెన్ షాహిదీ 26 పరుగులు చేసి రాణించారు. ఓమర్జాయ్ 22 పరుగులు, రహ్మనుల్లా గర్భాజ్ 21 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. చివర్లో రషీద్ ఖాన్ 18 బంతుల్లో 3 సిక్సులు రెండు ఫోర్లతో 35 పరుగులు చేసాడు. ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్ రెండు వికెట్లు తీసుకోగా.. స్టార్క్, జంపా, మ్యాక్స్ వెల్ కు తలో వికెట్ లభించింది.