- కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు
ఇబ్రహీంపట్నం, వెలుగు: కానిస్టేబుల్నాగమణి హత్య కేసు దర్యాప్తులో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో రాచకొండ సీసీ సుధీర్‌బాబు స్పందించారు. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించడంతోపాటు సత్యనారాయణను సీపీ ఆఫీసుకు అటాచ్‌చేశారు. వారం కింద ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ నుంచి స్కూటీపై డ్యూటీకి వెళ్తున్న కానిస్టేబుల్ నాగమణిని సొంత తమ్ముడే అత్యంత దారుణంగా నరికి చంపాడు.
తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్‌చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో నిందితుడికి సహకరించిన ఏ2 అచ్చన శివను పట్టుకోవడంలో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ అలసత్వం ప్రదర్శిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు, కులసంఘాల నాయకులు ఆరోపిస్తూ ఉన్నతాధికారులను ఆశ్రయించారు.
గతంలో ఓ ఎస్సైతో కలిసి ఓ కేసు నుంచి నిందితులను తప్పించి బాధితులకు తీవ్ర అన్యాయం చేశాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీపీ సీరియస్‌గా స్పందించారు. అలాగే ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం పోలీసులు అచ్చన శివను అదుపులోకి తీసుకున్నారు.