ఇబ్రహీంపట్నంలో జిల్లా కోర్టు ప్రారంభం

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నంలో కొత్తగా 15వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి​కోర్టును హైకోర్టు సీజే జస్టిస్ అలోక్​ అరాదే శుక్రవారం వర్చువల్​గా ప్రారంభించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో భాగంగా అదనపు కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ ​సెషన్స్​జడ్జి శశిధర్ రెడ్డి నేరుగా హాజరై కోర్టు భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కోర్టు జడ్జిలు జయ ప్రసాద్, శ్రీదేవి, రీటా లాల్, యశ్వంత్ సింగ్, హిమబిందు, ఇబ్రహీంపట్నం బార్ ​అసోసియేషన్ ​అధ్యక్షుడు అంజన్​ రెడ్డి, కార్యదర్శి మహేందర్, సీనియర్​ న్యాయవాదులు పాల్గొన్నారు.