
- మేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నం, వెలుగు : బీఆర్ఎస్ మేనిఫెస్టోతో అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తిలో చారిత్రాత్మక నందీశ్వరాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు క్యామ మల్లేశ్, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు అందని బీ ఫామ్
తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్ లు అందించారు. కానీ ఇందులో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మాత్రం ఇవ్వలేదు. సోమవారం అందించే బీ ఫామ్‌లలో ఎమ్మెల్యేది ఉంటుందని సమాచారం. గతంలో సిట్టింగ్ ల జాబితాలోనే మంచిరెడ్డి పేరును సీఎం ప్రకటించారు.