- ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్‌కు బానిసలు..ఒంటరి మహిళలే టార్గెట్ గా చోరీలు
- ఇబ్రహీంపట్నంలో బీటెక్ స్టూడెంట్, మెడికల్షాప్వర్కర్ అరెస్ట్
- 6 తులాల గోల్డ్, కారు స్వాధీనం
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కు బానిసలై ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని ఇబ్రహీపట్నం పోలీసులు పట్టుకున్నారు. 6 తు లాల బంగారు ఆభరణాలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ కేపీవీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్న గూడెంకు చెందిన ఊటుకూరి ప్రభాస్(20) బీటెక్స్టూడెంట్. ఇతను కొంతకాలంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉంటున్నాడు.
ఆన్లైన్ బెట్టింగ్స్ లో డబ్బు పోగొట్టుకున్నాడు. నల్గొండ జిల్లా శాలిగౌరారం గ్రామానికి చెందిన గుండ్లపల్లి శివ(19) మెడికల్షాపులో వర్కర్. ఇతను కూడా ఆన్లైన్బెట్టింగ్స్, గేమ్స్ఆడి డబ్బు లాస్ అయ్యాడు. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్. ఈజీ మనీ కోసం చోరీలు ప్లాన్చేశారు. ఒంటరిగా ఉంటున్న మహిళలు, వృద్ధుల ఇండ్ల ను గుర్తించడం మొదలుపెట్టారు. ఈ నెల 10న ఓ కారును కిరాయికి తీసుకుని కందుకూరు మండలం ఆకులమైలారం చేరుకున్నారు.
ఒంటరిగా ఉంటున్న దేవరశెట్టి సుమతమ్మ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు(4 గాజులు, రెండు తులాల పుస్తెల తాడు) గుంజుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గ్రీన్ ఫార్మా సిటీ పోలీసులు ప్రభాస్, శిను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసి ఆభరణాలు, కారు, ఐ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.