బర్మింగ్‌హామ్: ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎస్‌బీఏ) వరల్డ్ గేమ్స్‌లో ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లో 114/8 స్కోరు చేసింది.
వర్షం కారణంగా ఇండియా టార్గెట్‌ను 42 రన్స్‌గా సవరించారు. ఇండియా 3.3 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేసింది. కాగా, మెన్స్‌లో ఇండియా సిల్వర్ తో సరిపెట్టింది. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది.