
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరు జలాశయం కట్ట, అలుగు గేట్ల సేఫ్టీని ఐబీఎస్ఈ నర్సింగరావు శనివారం పరిశీలించారు. వేసవిలో జలాశయంలో నీరు నిల్వ ఉండడంతో కట్టకు ఎక్కడైనా పగుళ్లు ఏర్పడ్డాయా అని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఐబీఈఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, డీఈ రత్నకుమారి, జేఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు.