IC 814 Controversy: 'IC 814' హైజాక్ ఉగ్రవాదుల పేర్లపై..నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ కీలక ప్రకటన

IC 814 Controversy: 'IC 814' హైజాక్ ఉగ్రవాదుల పేర్లపై..నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ కీలక ప్రకటన

'IC 814 ది కాందాహార్ హైజాక్' సిరీస్ పై నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా  'శంకర్', 'భోలా' వంటి పేర్లు పెట్టారంటూ వస్తోన్న విమర్శలపై నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ (Monica Shergill) మంగళవారం (సెప్టెంబర్ 3న) ఒక ప్రకటన విడుదల చేశారు.

అదేంటంటే.."1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్..'IC 814' కాందాహార్ హైజాక్ సిరీస్ లో విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల అసలు పేర్లను జోడించబడిందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్, మోనికా షెర్గిల్  (సెప్టెంబర్ 3న) ప్రకటించారు" అలాగే భారతదేశంలో గొప్ప కథలు చెప్పే సంస్కృతి ఉంది..ఈ కథలను మరియు వాటి ప్రామాణికమైన ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించడానికి మేము ఎల్లప్పుడు కట్టుబడి ఉన్నాము" అని మోనికా షెర్గిల్ అన్నారు.

ALSO READ : IC 814 Controversy: కేంద్రం సమన్లతో దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్..దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని హామీ

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో ఆమె సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఈ తాజా ప్రకటనతో IC 814 పై నెలకొన్న వివాదం పూర్తయినట్లే అని తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన సమన్లతో దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ తాజా అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షకీర్. కానీ, ఈ వెబ్ సిరీస్‌లో ఉగ్రవాదులకు 'శంకర్', 'భోలా' వంటి హిందూ పేర్లను, 'చీఫ్', 'డాక్టర్', 'బర్గర్' వంటి పేర్లను ఉపయోగించారు. దీంతో ఈ వివాదం అగ్గి రాజుకుంది.

ఈ సీరీస్లో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ ఐసీ 814 విమానం కెప్టెన్ శరణ్ దేవ్ గా నటించాడు. స్టార్ హీరో అరవింద్ స్వామి.. విదేశాంగ శాఖ సెక్రటరీ శివరామకృష్ణన్ పాత్రలో నటించగా..రా జాయింట్ సెక్రటరీ రంజన్ మిశ్రాగా నటుడు కుముద్ మిశ్రా కనిపించారు.