ICAI: రికార్డు స్థాయిలో చార్టర్డ్ అకౌంటెంట్లపై క్రమశిక్షణా చర్యలు

ICAI: రికార్డు స్థాయిలో చార్టర్డ్ అకౌంటెంట్లపై క్రమశిక్షణా చర్యలు

ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రికార్డు స్థాయిలో 241 మంది CA లపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. గతేడాది ఇది 119 గా ఉంది. 

ICAI  మొత్తం 4లక్షలకు పైగా సభ్యులను కలిగి ఉంది.క్రమశిక్షణా చర్యల్లో భాగంగా చార్టర్డ్ అకౌంటెంట్ పేరును 15 రోజుల నుంచి5 సంవత్సరాల వరకు జాబితా నుం డి తొలగించనుంది. దీంతో పాటు రూ. 5వేల నుంచి  రూ. 5 లక్షల వరకు జరిమానా విధించనుంది. 

ALSO READ | పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్.. ఇల్లు, కారు ,వ్యక్తిగత లోన్లపై వడ్డీరేట్లు తగ్గింపు

2007లో ICAI  ప్రారంభమైనప్పటి నుంచి ఫిబ్రవరి 11, 2025 వరకు 2,771 కేసుల్లో క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పగినట్టు తేలింది. ఈ కేసులను విచారణ కోసం బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ డిసిప్లినరీ కమిటీకి పంపారు.వాటిలో  2వేల354 కేసులలో విచారణలు ముగిశాయి. 

2వేల354 కేసుల్లో 1,072 కేసుల్లో సభ్యులు వృత్తిపరమైన క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు ICAI తెలిపింది.