
వ్యవసాయ సంబంధ పీజీ కోర్సుల్లో 2024-–25 విద్యా సంవత్సరం అడ్మిషన్స్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్- ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ (ఐకార్- ఏఐఈఈఏ పీజీ)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రత్యేకించిన సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
విభాగాలు: ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్సెస్, ఫిషరీస్ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, వాటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ఆగస్టు 31 నాటికి 19 ఏండ్లు నిండి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష జూన్ 29న నిర్వహిస్తారు. హైదరాబాద్/ సికింద్రాబాద్/ రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ లో ఎగ్జామ్స్ సెంటర్స్ ఉన్నాయి. పూర్తి వివరాలకు www.exams.nta.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.