ICC Trophy: హెడ్, జయసూర్యపై ఆధిపత్యం.. శ్రీలంక క్రికెటర్‌కు ఐసీసీ అవార్డు

ICC Trophy: హెడ్, జయసూర్యపై ఆధిపత్యం.. శ్రీలంక క్రికెటర్‌కు ఐసీసీ అవార్డు

శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ ను ఐసీసీ అవార్డు వరించింది. ఈ లంక యువ క్రికెటర్ సెప్టెంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఐసీసీ ఈ విషయాన్ని సోమవారం (అక్టోబర్ 14) ప్రకటించింది. సెప్టెంబర్ 2024లో కమిందు మెండిస్ అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతను బ్యాటింగ్ లో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో పలు ప్రపంచ రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఆడిన ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో కమిందు 90.20 యావరేజ్ తో 451 పరుగులు చేశాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి 8 టెస్టుల్లో 50కి పైగా స్కోర్ చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇదే క్రమంలో కేవలం 13 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులను పూర్తి చేసుకొని ఆస్ట్రేలియా ఆల్ టైం బెస్ట్ ప్లేయర్ సర్ డాన్ బ్రాడ్ మన్ సరసన చేరాడు. బ్రాడ్ మన్ 1000 పరుగులు చేయడానికి కేవలం 13 ఇన్నింగ్స్ లు అవసరం కాగా.. మెండీస్ ఆ రికార్డ్ సమం చేశాడు. ఈ అవార్డు నామినీలుగా ఉన్న  ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్, తన దేశానికే చెందిన ప్రబాత్ జయసూర్యను ఓడించి గెలుచుకున్నాడు. 

ALSO READ | IND vs NZ 2024: భారత జట్టులో ఆ రెండు సామర్ద్యాలున్నాయి: గౌతమ్ గంభీర్

 

మెండీస్ ఈ అవార్డు అందుకోవడం ఈ ఏడాది ఇది రెండో సారి. అంతకముందు మార్చి నెలలో అతను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్‌కు సెప్టెంబర్ 2024 ఫిమేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఐర్లాండ్ మహిళలపై ఆమె ప్రదర్శనకు గాను ఈ అవార్డు గెలుచుకుంది. ఈ సిరీస్ లో మొత్తం 106 సగటుతో 206 పరుగులు చేసింది.