T20 World Cup 2024: మనోళ్లే ఆరుగురు.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన ఐసీసీ

T20 World Cup 2024: మనోళ్లే ఆరుగురు.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన ఐసీసీ

టీ20 వరల్డ్ కప్ 2024 జట్టును ఐసీసీ ప్రకటించింది. వరల్డ్ కప్ లో అత్యత్తమ ఆట తీరును ప్రదర్శించిన ఆటగాళ్లను ఒక జట్టుగా ప్రకటిస్తారు. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగించింది. 11 మందితో కూడిన ఈ జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు స్థానం దక్కడం విశేషం. ఆస్ట్రేలియా,  వెస్టిండీస్ జట్ల నుంచి ఒకరు మాత్రమే ఎంపికయ్యారు. 

ఓపెనర్లుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వరల్డ్ కప్ లో నిలకడగా రాణించిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మనుల్లా గర్భాజ్ కు చోటు  దక్కింది. విండీస్ స్టార్ నికోలస్ పూరన్, సూర్య కుమార్ యాదవ్ వరుసగా మూడు, నాలుగు స్థానాలకు ఎంపిక చేశారు. ఆల్ రౌండర్లుగా స్టోయినీస్, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, అక్షర్ పటేల్ ఈ మెగా జట్టుకు ఎంపికయ్యారు. పేస్ బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్ ఫారూఖీని ఐసీసీ తమ జట్టులో ఎంపిక చేసింది.

Also Read:కోహ్లీ, రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారా..? క్లారిటీ ఇచ్చిన జైషా

సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ నోకియా 12 వ ఆటగాడిగా సెలక్టయ్యాడు. సెమీస్ వరకు వచ్చినా ఇంగ్లాండ్ జట్టు నుంచి ఒక్కరు కూడా సెలక్ట్ కాకపోవడం గమనార్హం. నెల రోజుల పాటు 20 జట్లతో అలరించిన ఈ టోర్నీలో భారత్ ట్రోఫీ గెలుచుకుంది. శనివారం (జూన్ 29) దక్షణాఫ్రికాపై ముగిసిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. వీరు కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.