ICC ప్రైజ్ మనీ పాలసీ : లేడీస్ టీం అయినా.. జంట్స్ టీం అయినా ఒక్కటే

ICC ప్రైజ్ మనీ పాలసీ : లేడీస్ టీం అయినా.. జంట్స్ టీం అయినా ఒక్కటే

అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ICC) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో మొదటిసారి మహిళలకు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ అందిస్తోంది. రాబోయే మహిళల T20 ప్రపంచ్ కప్ 2024లో పురుషులతో సమానంగా ప్రైజ్ మనీని ప్రకటించింది. 

విజేతలకు రూ.66 కోట్ల 64లక్షల(2.34 మిలియన్ల డాలర్లు)ప్రైజ్ మనీ అందించనున్నారు. టోర్నీ రన్నప్ లకు (1.17 మిలియన్ డాలర్లు) ప్రైజ్  మనీ అందించనున్నారు.  ఇది 2023 ఛాంపియన్లకు ఇచ్చిన ప్రైజ్ మనీకంటే 134 శాతం ఎక్కువ. ప్రతిష్టాత్మకమైన మహిళల T20  ప్రపంచ కప్ అక్టోబర్ 3 నుంచి UAEలో ప్రారంభం కానుంది.

జూలై 2023లో జరిగిన వార్షిక సమావేశంలో ICC ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే 2030 షెడ్యూల్ కంటే ఏడేళ్ల ముందుగానే ప్రైజ్ మనీని అందిస్తోంది. క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం.. పురుషులకు, మహిళలకు సమానంగా ప్రైజ్ మనీ అందిస్తున్న గేమ్ గా క్రికెట్ నిలిచింది. 

2024  ఏడాది టీ20 ప్రపంచకప్​ టైటిల్​ గెలుచుకున్న పురుషుల జట్టు టీమ్​ఇండియాకు USD 2.45 మిలియన్ క్యాష్ ప్రైజ్​ను అందించింది ఐసీసీ. కాగా మహిళల టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌తో కలిపి మొత్తం 23 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.