T20 World Cup 2024: శని వదిలాడు.. సెమీఫైనళ్లకు మ్యాచ్ అఫీషియల్స్ ప్రకటన

T20 World Cup 2024: శని వదిలాడు.. సెమీఫైనళ్లకు మ్యాచ్ అఫీషియల్స్ ప్రకటన

గత నెల రోజులుగా వినోదాన్ని పంచుతోన్న టీ20 ప్రపంచకప్‌ ముగింపు దశకు చేరుకుంది. 20 జట్లతో మొదలైన ఈ టోర్నీలో చివరకు నాలుగు జట్లు మిగిలాయి. అఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్లో తలపడుతున్నాయి. తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా- అఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో భారత్- ఇంగ్లండ్‌ ఢీకొనబోతున్నాయి. 

టీ20 ప్రపంచకప్ సెమీఫైనళ్లకు మ్యాచ్ అఫీషియల్స్‌ను ఐసీసీ గురువారం(జూన్ 27) ప్రకటించింది. ట్రినిడాడ్‌ వేదికగా జరిగే ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌-1కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నితిన్ మీనన్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్‌బరో టీవీ అంపైర్‌గా, ఫోర్త్ అంపైర్‌గా హసన్ రజా, మ్యాచ్ రిఫరీగా రిచీ రిచర్డ్‌సన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

ఇండియా vs ఇంగ్లండ్

ఇక గయానా వేదికగా జరగనున్న ఇండియా vs ఇంగ్లాండ్‌ సెమీ-ఫైనల్ 2 పోరుకు క్రిస్ గఫానీ, రోడ్నీ టక్కర్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. టీవీ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా పాల్ రీఫిల్‌ నియమితులయ్యారు.

ఐరన్ లెగ్

ఐసీసీ మెగా టోర్నీల్లో భారత జట్టు ఓటములకు కారణమవుతూ ఐరన్ లెగ్ అన్న ముద్ర వేసుకున్న రిచర్డ్ కెటిల్‌బరోను కీలక మ్యాచ్ భాద్యతల తప్పించడం కొసమెరుపు. ఒకవేళ ఆఫ్ఘన్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ ఒకరోజు ముందు నిర్ణయించి ఉంటే అతన్ని తప్పకుండా కొనసాగించేవారు. భారత్ మ్యాచ్‌లకు ఐసీసీ అతన్ని కావాలనే నియమిస్తోందన్న విమర్శలు రావడంతో వెనక్కు తగ్గిందన్న మాటలూ వినపడుతున్నాయి. 

దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ (ట్రినిడాడ్)

  • ఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ మరియు నితిన్ మీనన్
  • టీవీ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో
  • ఫోర్త్ అంపైర్: అహ్సన్ రజా
  • మ్యాచ్ రిఫరీ: రిచీ రిచర్డ్‌సన్

భారత్ v ఇంగ్లాండ్ (గయానా)

  • ఆన్-ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గఫానీ, రోడ్నీ టక్కర్
  • టీవీ అంపైర్: జోయెల్ విల్సన్
  • ఫోర్త్ అంపైర్: పాల్ రీఫిల్
  • మ్యాచ్ రిఫరీ: జెఫ్రీ క్రోవ్