2024 సంవత్సరానికి సంబంధించిన ఐసీసీ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు టీ20 వరల్డ్‌కప్ గెలుపు సారథి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లు చోటు సంపాదించారు. మిగిలిన ఏడుగురు.. ఏడు వేరువేరు దేశాలకు చెందినవారు.
రో'హిట్'
రోహిత్ శర్మ కెరీర్‌లో 2024 కలకాలం గుర్తుండిపోయే సంవత్సరం. దాదాపు 17 ఏళ్ల తరువాత రోహిత్ మరోసారి తన సారథ్యంలో దేశానికి టీ20 ప్రపంచ కప్ సాధించి పెట్టాడు. హిట్‌మ్యాన్ గతేడాది 11 మ్యాచ్‌ల్లో 42.00 సగటు, 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో 378 పరుగులు చేశాడు.
ALSO READ | ICC: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. 2024 అత్యుత్తమ టీ20 జట్టు ఇదే
ఐసీసీ మెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్-భారత్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సికందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (భారత్), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్), వనిందు హసరంగా (శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా (భారత్), అర్ష్‌దీప్ సింగ్ (భారత్).
Congratulations to the elite players selected for the ICC Men’s T20I Team of the Year 2024 🙌 pic.twitter.com/VaPaV6m1bT
— ICC (@ICC) January 25, 2025
ఓపెనర్‌గా మంధాన
ఇక వుమెన్స్ జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఓపెనర్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మ అత్యుత్తమ టీ20 జట్టులో భాగమయ్యారు. అత్యధికంగా భారత జట్టు నుంచి ముగ్గురు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సౌతాఫ్రికా ప్లేయర్ ఎల్ వోల్వార్డ్ కెప్టెన్ గా ఎంపికైంది.
ఐసీసీ ఉమెన్స్ T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: ఎల్ వోల్వార్డ్ (కెప్టెన్-దక్షిణాఫ్రికా), మారిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా), స్మృతి మంధాన (భారత్), రిచా ఘోష్ (వికెట్ కీపర్-భారతదేశం), దీప్తి శర్మ (భారత్), చమరి అటపట్టు (శ్రీలంక), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), నాట్ సెవార్డ్ బ్రంట్ (ఇంగ్లాండ్), మెల్లీ కర్ (ఆస్ట్రేలియా), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (ఐర్లాండ్), సాడియా ఇక్బాల్ (పాకిస్థాన్).
Applauding all the superstars who made the ICC Women's T20I Team of the Year for 2024 👏 pic.twitter.com/cPYHRH9cko
— ICC (@ICC) January 25, 2025