World Cup2023: ఐసీసీ కొత్త రూల్స్.. బ్యాటర్లకు ఇక చుక్కలే

 World Cup2023: ఐసీసీ కొత్త రూల్స్.. బ్యాటర్లకు ఇక చుక్కలే

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ మొదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఐసీసీ వరల్డ్ కప్ పిచ్ ల మీద  ప్రత్యేక దృష్టి సారించినట్టుగా సమాచారం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా పిచ్‌ల‌ను త‌యారు చేసేలా క్యూరెట‌ర్స్‌కు సూచనలు ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఇటీవలే అంతర్జాతీయ మ్యాచుల్లో అలవోకగా భారీ స్కోర్లు నమోదవుతున్న తరుణంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ఈ సారి బ్యాటర్లకు కష్టమే 

ఈ సారి వరల్డ్ కప్ భారత్ లో జరుగుతుండడంతో స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది అనే వాదనలు ఉన్నాయి. పైగా అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌ల‌లో ఇండియాలో మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో స్పిన్న‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తారని మాజీ క్రికెట‌ర్లు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పిచ్‌ల‌పై గ్రాస్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాల‌ని క్యూరెట‌ర్స్‌కు ఆదేశాలు జారీ చేసినట్లుగా స‌మాచారం. ఇక బౌండరీల విషయంలో ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత్ లో 65 మీట‌ర్లుగా ఉన్న బౌండరీ దూరం ఐదు మీట‌ర్లు పెంచి 70 మీట‌ర్లు ఉండేలా చూడాల‌ని ఐసీసీ సూచించిందంట.ప్రస్తుతం ఐసీసీ మార్పులు చేస్తున్న ఈ రూల్స్ బ్యాటర్లతో పాటు భారత్ కి కూడా ప్రతికూలంగా మారనుంది.