క్రికెట్ నుంచి..బంగ్లాదేశ్ ఆల్ రౌండర్‌ను నిషేధించిన ఐసీసీ

క్రికెట్ నుంచి..బంగ్లాదేశ్ ఆల్ రౌండర్‌ను నిషేధించిన ఐసీసీ

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హొస్సేన్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించాడనే ఆరోపణలను అంగీకరించిన ఈ బంగ్లా ఆల్ రౌండర్ పై  రెండేళ్ల నిషేధం విధించారు. దీని ప్రకారం హుస్సేన్ రానున్న రెండేళ్లలో ఎలాంటి క్రికెట్ ఆడకూడదు. 2018లో బంగ్లాదేశ్ తరఫున చివరిగా వన్డే మ్యాచ్‌లో ఆడాడు. సెప్టెంబర్ 2023లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చేత అభియోగాలు మోపగా.. అతను మూడు ఆరోపణలను అంగీకరించాడు 
  
హొస్సేన్ 2011లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఏడేళ్ల పాటు బంగ్లాదేశ్ క్రికెట్ లో నిలకడగా ఆడుతూ కీలక ప్లేయర్ గా మారాడు. కెరీర్ లో మొత్తం 115 మ్యాచ్‌లు ఆడి 2695 పరుగులు చేసాడు. బౌలింగ్ లోనూ రాణించి 39 వికెట్లు తీశాడు. 2018 తర్వాత, హొస్సేన్ ఎక్కువగా దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇటీవలే ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ తరపున  ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్నాడు.