ఫిక్సింగ్ అభియోగాలతో వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్పై ఐసీసీ వేటు వేసింది. థామస్ లంక ప్రీమియర్ లీగ్లో ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఐసీసీ తెలిపింది. 2021 లో జరిగిన లంక ప్రీమియర్ లీగ్ లో అతను ఫిక్సింగ్ చేశాడని ఐసీసీ పేర్కొంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్, అబుదాబి టీ10 టోర్నీల్లో కూడా ఫిక్సింగ్ చేసేందుకు బుకీలు డెవాన్ థామస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టాడని ఐసీసీ తెలిపింది.
తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై డెవాన్ థామస్ ఇప్పటి వరకు స్పందించలేదు. 33 ఏళ్ల థామస్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించడానికి 14 రోజుల సమయం ఉంది. డెవాన్ థామస్ వెస్టిండీస్ తరపున 21 వన్డేలు ఆడిన థామస్..238 పరుగులు సాధించాడు. 12 టీ20ల్లో 51 రన్స్ కొట్టాడు. ఒక టెస్ట్ మ్యాచ్ లో 31 పరుగులే చేశాడు. ఒక టెస్టులో 2 వికెట్లు, 21 వన్డేల్లో 2 వికెట్లు సాధించాడు. థామస్ చివరిగా డిసెంబర్‌లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. జూన్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగే ODI సిరీస్ కోసం విండీస్ జట్టుకు ఎంపికయ్యాడు.