Praveen Jayawickrama: మ్యాచ్ ఫిక్సింగ్.. శ్రీలంక స్పిన్నర్‌పై ఐసీసీ విచారణ

శ్రీలంక స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిందని అభియోగాలు మోపింది. 25 ఏళ్ల జయవిక్రమ మూడు వేర్వేరు కోడ్‌లను ఉల్లంఘించారని  గురువారం (ఆగస్టు 8) ఐసీసీ ఆరోపించింది. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు 2021 లంక ప్రీమియర్ లీగ్ సీజన్ లో అతనిపై అభియోగాలు మోపింది. జయవిక్రమ  లంక ప్రీమియర్ లీగ్ లో 2021 లో జఫ్న కింగ్స్ తరపున ఆడగా.. ఆ జట్టు టైటిల్ గెలుచుకుంది. తాజాగా ముగిసిన 2024 సీజన్ లో జయ విక్రమ దంబుల్లా సిక్సర్ తరపున ఆడాడు.  

తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఆగస్ట్ 6 నుంచి 20 వరకు ఈ గడువు ఉంటుంది.  ఆర్టికల్ 2.4.4 మరియు ఆర్టికల్ 2.4.7 ప్రకారం ICC అతనిపై నేరం మోపింది. ఆర్టికల్స్ 1.7.4.1 అదేవిధంగా 1.8.1 ప్రకారం..  అంతర్జాతీయ మ్యాచ్ ఛార్జీలతో పాటు లంక ప్రీమియర్ లీగ్ ఛార్జీకి సంబంధించి ఐసీసీ చర్యలు తీసుకోనుంది. జయవిక్రమ రెండేళ్లుగా శ్రీలంక తరపున ఆడలేదు. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 అతనికి చివరిది.