ODI World Cup 2023: మధ్యాహ్నం 2 గంటలకు కెప్టెన్స్ డే సెలబ్రేషన్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఇలా చూడండి

ఒక్క రోజు, ఒకే ఒక్క రోజు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే రోజు రానుంది. నెలలు, రోజులు గడచిపోయి క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఇప్పుడు గంటలు లెక్కించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ మెగా ఈవెంట్ కి ఓపెనింగ్ సెర్మనీ మధ్యలో కానీ చివర్లో నిర్వహిస్తామని ఇప్పటికే బీసీసీఐ పెద్దలు స్పష్టం చేశారు. దీనికి బదులుగా, అక్టోబర్ 4న టీమ్ కెప్టెన్‌లందరితో ఫోటో సెషన్, ప్రపంచ కప్ ట్రోఫీని నిర్వహించడం జరిగింది.

ఈ రోజు జరగనున్న కెప్టెన్స్ ఈవెంట్ కి నేడు( బుధవారం) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ  స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నాం 2:30 నిమిషాలకు మీడియాతో కెప్టెన్ ఇంటరాక్షన్ సెషన్ కోసం ఈ టోర్నీలో పాల్గొనే 10 దేశాలకు చెందిన మొత్తం 10 మంది కెప్టెన్లు అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. రోహిత్, బాబర్‌లతో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్. ఈవెంట్ కోసం హాజరు కానున్నారు.
 
స్టార్ స్పోర్ట్స్ లో ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఇక వరల్డ్ కప్ మ్యాచులన్నీ కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లోనే ప్రసారమవుతాయి. మొబైల్స్ లో ఈ మ్యాచులన్నీ హాట్ స్టార్ యాప్ లో ఫ్రీగా చూసే అవకాశం దక్కింది. కాగా.. రేపు  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ  స్టేడియంలోనే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో తలపడతాయి.