షకీబ్, రహీమ్ హాఫ్ సెంచరీలు : అఫ్ఘాన్ టార్గెట్-263

షకీబ్, రహీమ్ హాఫ్ సెంచరీలు : అఫ్ఘాన్ టార్గెట్-263

సౌతాంప్టన్: అఫ్ఘాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లా ప్లేయర్లు..నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 రన్స్ చేసింది. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ మరోసారి రాణించాడు. షకీబ్(51 హాఫ్ సెంచరీ) ఔట్ అయినా ..మరో ఎండ్ లో వచ్చిన రహీమ్ (83) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. చివరి వరకు ఆచితూచి ఆడుతూ అవసరమైనప్పుడు బౌండరీలు బాదుతూ వచ్చాడు రహీమ్. దీంతో అఫ్ఘాన్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ను ఉంచింది బంగ్లా.

బంగ్లా ప్లేయర్లలో..లిటిన్ దాస్(16), ఇక్బాల్(36), షకీబ్(51), మహ్మదుల్లా(27), మొసద్దెక్ హస్సెన్(35), రహీమ్(83) రన్స్ తో రాణించగా..సౌమ్యా సర్కార్ (3) రన్స్ కే ఔట్ అయ్యాడు.

అఫ్ఘాన్ బౌలర్లలో..ముజీబ్ (3) గుల్బాదిన్ నబీ (2), వికెట్లతో చెలరేగగా..మహ్మద్ నబీ, జార్దాన్ చెరో వికెట్ తీశారు.