విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ విన్నర్‌‌‌‌కు రూ.19 కోట్ల ప్రైజ్‌‌‌‌మనీ : ఐసీసీ

విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ విన్నర్‌‌‌‌కు రూ.19 కోట్ల ప్రైజ్‌‌‌‌మనీ : ఐసీసీ
  • ఇకపై మెన్స్‌, విమెన్స్‌ వరల్డ్ కప్స్‌‌లో సమాన నజరానా: ఐసీసీ 

దుబాయ్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌మనీ విషయంలో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ విన్నర్లకు సమాన ప్రైజ్‌‌‌‌మనీ ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెలలో జరగనున్న విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి ఈ  కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ లెక్కన వచ్చే నెల 3 నుంచి జరిగే విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ విన్నర్‌‌‌‌ రూ. 19 కోట్ల 60 లక్షలు (2.34 మిలియన్‌‌‌‌ అమెరికన్‌‌‌‌ డాలర్లు) అందుకోనుంది.

 2023లో ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియాకు  ఒక మిలియన్‌‌‌‌ డాలర్లు (రూ. 8.3 కోట్లు) మాత్రమే లభించగా, ఇప్పుడు దాన్ని 134 శాతం పెంచారు. టోర్నీ మొత్తం ప్రైజ్‌‌‌‌మనీని ఏకంగా 225 శాతం పెంచి రూ. 66 కోట్ల 60 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ విన్నర్‌‌‌‌కు రూ. 20 కోట్ల 50 లక్షలు  లభించాయి. ‘2030 షెడ్యూల్‌‌‌‌లో భాగంగా మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ విన్నర్లకు సమాన ప్రైజ్‌‌‌‌మనీ ఉండాలని నిర్ణయించాం. 

విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌తో ఈ షెడ్యూల్‌‌‌‌ మొదలవుతుంది. అందుకే ఈ టోర్నీ నజరానాను భారీగా పెంచాం’ అని ఐసీసీ వెల్లడించింది. రన్నరప్‌‌‌‌గా నిలిచే జట్టు రూ. 9 కోట్ల 80 లక్షలు అందుకోనుంది. సెమీస్‌‌‌‌లో ఓడిన రెండు జట్లకు చెరో రూ. 5 కోట్ల 65 లక్షలు లభిస్తాయి. గ్రూప్‌‌‌‌ దశలో ప్రతి విజయానికి రూ. 26 లక్షలు కేటాయించారు.