టీ20 వరల్డ్ కప్ ఎప్పుడూ లేని విధంగా ఈ సారి 20 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 5 జట్లతో నాలుగు గ్రూప్ లుగా విభజించబడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ఐసీసీ ప్రైజ్ మనీని భారీగా పెంచింది. ఈ టోర్నీ ప్రైజ్ మనీ మొత్తం అక్షరాలా రూ. 93.51 కోట్ల రూపాయలు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఈ ప్రైజ్ మనీ అత్యధికం. గెలిచిన జట్టుకు రూ. 20.3 కోట్ల రూపాయలు అందుకోనుంది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ 10.64 కోట్ల రూపాయలు దక్కనున్నాయి.
సెమీ ఫైనల్లో ఓడిన రెండు జట్లకు రూ. 6. 55 కోట్లు..సూపర్ 8 దశకు వచ్చిన జట్లకు రూ. 3.18 కోట్ల రూపాయలు లభిస్తాయి. ఇక గ్రూప్ లో మూడో స్థానంలో నిలిచిన జట్లకు రూ. 2.06 కోట్లు.. మిగిలిన జట్లకు రూ. 1.87 కోట్లు లభిస్తాయి. గ్రూప్ దశలో విజయం సాధించిన జట్టుకు రూ. 25.9 లక్షలు ప్రైజ్ మనీ దక్కుతుంది. మొత్తం నాలుగు వారాల్లో 55 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. గత వరల్డ్ కప్ (2022) లో విజేతకు రూ. 12 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. అయితే ఈ సారి దాదాపు రెట్టింపు ప్రైజ్ మనీ లభించనుంది.
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఆదివారం (జూన్ 2) గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆతిధ్య దేశాలు అమెరికా, వెస్టిండీస్ లు బోణీ కొట్టాయి. నేడు( జూన్ 4) శ్రీలంక, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరగనుంది. జూన్ 19 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతాయి. జూన్ 27న సెమీ ఫైనల్స్.. 29 న బార్బడోస్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
T20 WORLD CUP PRIZE MONEY:
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2024
Winner - 20.36cr.
Runner Up - 10.64cr.
- 93.52CR WILL BE GIVEN BY THE ICC IN THE PRIZE MONEY OVERALL. 🤯🏆 pic.twitter.com/1CupQwSUzk