T20 World Cup 2024: ప్రమాదకర పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. భారత్- పాక్ మ్యాచ్‌కు మినహాయింపు

T20 World Cup 2024: ప్రమాదకర పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. భారత్- పాక్ మ్యాచ్‌కు మినహాయింపు

టీ20 వరల్డ్ కప్ అంటే పరుగుల వరద అని ఫిక్స్ అయిపోతారు. అయితే న్యూయార్క్ నసావు కౌంటీ క్రికెట్ వేదికలో 2024 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు అభిమానవులకు విసుగు తెప్పించాయి. బౌండరీల సంగతి పక్కనపెడితే సింగిల్స్ తీయడానికి బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. ఈ వేదికపై జరిగిన 8 మ్యాచ్ ల్లో ఒక్కసారి కూడా 150 కు పైగా రాకపోవడం విశేషం. ఆటగాళ్లు వికెట్లు కాపాడుకునే క్రమంలో పరుగులు చేయడం మర్చిపోతున్నారు. స్వల్ప లక్ష్యాన్ని కూడా డిఫెండ్ చేసుకోవడం విశేషం. తాజాగా ఈ పిచ్ కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. 

న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలోని పిచ్ 'సంతృప్తికరంగా లేదు' అని తమ రేటింగ్ తెలిపింది. వేదికపై భారీ ఫ్లాక్ వచ్చిందని.. ప్రమాదకరమైన పిచ్ గా పరిగణించింది. న్యూయార్క్‌లో జరిగిన ఇండియా,ఐర్లాండ్ మ్యాచ్.. శ్రీలంక, సౌతాఫ్రికా మ్యాచ్‌లు మరీ పేలవమైన రేటింగ్ ఇవ్వబడింది. రెండు మ్యాచ్ ల్లో కనీసం 100 పరుగుల స్కోర్ కూడా రాలేదు. అయితే ఇదే వేదికపై అత్యంత పాపులర్ మ్యాచ్ భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ కు పేలవమైన పిచ్ ఉందని ఐసీసీ భావించట్లేదని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో భారత్ కేవలం 119 పరుగులను  డిఫెండ్‌ చేసుకోవడం విశేషం. 

ఈ వేదికపైనా సగటు స్కోరు కేవలం 108 మాత్రమే కాగా.. 16 ఇన్నింగ్స్‌లలో అత్యధిక స్కోరు 137.  దీన్ని బట్టి పిచ్ ఎంత దారుణంగా ఉందనే విషయాన్నీ అర్ధం చేసుకోవచ్చు. రూ.250 కోట్లు ఖర్చు పెట్టి మూడు నెలల పాటు కష్టపడి కట్టిన ఈ స్టేడియంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ కేవలం పిచ్ సమస్య మాత్రమే కాదు అవుట్ ఫీల్డ్ కూడా చాలా మందకొండిగా ఉంది. దీంతో ఈ స్టేడియాన్ని  కూల్చేయాలని వార్తలు వచ్చాయి.