Champions Trophy 2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ.. ఏయే దేశాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

Champions Trophy 2025: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ.. ఏయే దేశాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. గ్రౌండ్‌‌‌‌లో వన్డే వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు మేటి ఎనిమిది జట్లు సిద్ధమయ్యాయి. దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డపై చాంపియన్ల ఆట మరికొన్ని గంటల్లో మొదలవనుంది. తమ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నీ దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడనున్న టీమిండియా ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. 

బుధవారం (ఫిబ్రవరి 19) గ్రాండ్ గా ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. కరాచీలోని నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యం ఇస్తుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్ గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో బరిలో నిలవగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్– 2లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.

Also Read:-బ్రంట్‌‌‌‌‌‌‌‌ ఫటాఫట్​..గుజరాత్‌‌‌‌‌‌‌‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం..

1996 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ తర్వాత పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఆతిథ్యం ఇస్తున్న తొలి ఐసీసీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ఇదే కావడం  మరింత ప్రత్యేకత సంతరించుకుంది. భద్రతా కారణాల రీత్యా పాక్‌‌‌‌‌‌‌‌ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థులైన ఇండియా–పాకిస్తాన్ మధ్య మెగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో ఈ టోర్నీకి అసలైన ఊపు రానుంది. 

లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..? 

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లన్నీ టీవీ ఛానెల్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జియో హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్ లు లైవ్ చూడొచ్చు. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ లన్ని మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. 

పాకిస్తాన్: PTV, టెన్ స్పోర్ట్స్, మైకో, తమషా యాప్

యూఏఈ : క్రిక్ లైఫ్ మ్యాక్స్, క్రిక్ లైఫ్ మ్యాక్స్ 2, స్టార్స్ ప్లే 

యూకే: స్కై స్పోర్ట్స్ క్రికెట్, స్కై స్పోర్ట్స్ మెయిన్ ఈవెంట్, స్కై స్పోర్ట్స్ యాక్షన్, స్కైగో, స్కై స్పోర్ట్స్ యాప్ 

యూఎస్ఏ, కెనడా: విల్లో టీవీ, క్రిక్‌బజ్ యాప్ 

కరేబియన్ : ESPN కరేబియన్, ESPN ప్లే కరేబియన్ యాప్ 

ఆస్ట్రేలియా : ప్రైమ్ వీడియో

న్యూజిలాండ్: స్కై స్పోర్ట్ NZ, నౌ, స్కై గో యాప్ 

దక్షిణాఫ్రికా: సూపర్‌స్పోర్ట్, సూపర్‌స్పోర్ట్ యాప్

బంగ్లాదేశ్: టోఫీ యాప్, నాగోరిక్ టీవీ, టి స్పోర్ట్స్

ఆఫ్ఘనిస్తాన్: ATN

శ్రీలంక: మహారాజా టీవీ (లీనియర్‌లో టీవీ1), డిజిటల్ వయా సిరస

గత విజేతలు

1998 సౌతాఫ్రికా (నాకౌట్ ట్రోఫీ)

2000 న్యూజిలాండ్ (నాకౌట్ ట్రోఫీ)

2002 ఇండియా, శ్రీలంక (జాయింట్ విన్నర్స్‌‌‌‌‌‌‌‌) 

2004 వెస్టిండీస్ 

2006 ఆస్ట్రేలియా

2009 ఆస్ట్రేలియా  

2013 ఇండియా

2017  పాకిస్తాన్   

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ వివరాలు:
  
గ్రూప్ ఎ - పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్

గ్రూప్ బి - దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్

 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్:

ఫిబ్రవరి 19, పాకిస్తాన్ v న్యూజిలాండ్, (కరాచీ, పాకిస్తాన్)

ఫిబ్రవరి 20, బంగ్లాదేశ్ v ఇండియా (దుబాయ్)

ఫిబ్రవరి 21, ఆఫ్ఘనిస్తాన్ v దక్షిణాఫ్రికా (కరాచీ, పాకిస్తాన్)

ఫిబ్రవరి 22, ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ (లాహోర్, పాకిస్తాన్)

ఫిబ్రవరి 23, పాకిస్తాన్ v ఇండియా  (దుబాయ్)

ఫిబ్రవరి 24, బంగ్లాదేశ్ v న్యూజిలాండ్ (రావల్పిండి, పాకిస్తాన్)

ఫిబ్రవరి 25, ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా (రావల్పిండి, పాకిస్తాన్)

ఫిబ్రవరి 26, ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్ (లాహోర్, పాకిస్తాన్)

ఫిబ్రవరి 27, పాకిస్తాన్ v బంగ్లాదేశ్ (రావల్పిండి, పాకిస్తాన్)

ఫిబ్రవరి 28, ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా (లాహోర్, పాకిస్తాన్)

మార్చి 1, దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్ (కరాచీ, పాకిస్తాన్)

మార్చి 2, న్యూజిలాండ్ v ఇండియా (దుబాయ్)

మార్చి 4, సెమీ-ఫైనల్ 1, (దుబాయ్)

మార్చి 5, సెమీ-ఫైనల్ 2, (లాహోర్, పాకిస్తాన్)

మార్చి 9, ఫైనల్ (లాహోర్) (ఇండియా ఫైనల్ కు వస్తే దుబాయ్‌లో మ్యాచ్ జరుగుతుంది)

మార్చి 10, రిజర్వ్ డే