క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐసీసీ టైటిల్ సిద్ధంగా ఉంది. 2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్, భారత్ జట్లు తప్ప మిగిలిన దేశాలు తన స్క్వాడ్ లను ప్రకటించాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్స్ , ఆడమ్ జాంపా
ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియంసన్, విల్ యంగ్
ALSO READ | PSL 2025: అప్పుడు ఐపీఎల్.. ఇప్పుడు పాక్ సూపర్ లీగ్: వార్నర్, విలియంసన్ విడదీయలేని బంధం
దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, వాండెర్ డస్సెన్
ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు:
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్ , తంజిద్ హసన్, తాంజిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ , పర్వేజ్ హొస్సేన్, తంజైమ్ హసన్ షకీబ్, నసుమ్ అహ్మద్, నహిద్ రానా
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆఫ్ఘనిస్థాన్ జట్టు:
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెడిఖుల్లా అటల్, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్‌ఫార్, ఫూఖల్ అహ్మద్, ఫూఖాల్ అహ్మద్, మాలిక్, నవీద్ జద్రాన్.