ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో మనోళ్లే ముగ్గురు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో మనోళ్లే ముగ్గురు

వరల్డ్ కప్ లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ రెచ్చిపోయి ఆడారు. వరల్డ్ కప్ గెలవడంలో విఫలమైనా  వ్యక్తిగత ప్రదర్శనతో దుమ్మరేపారు. విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-5 లో స్థానం దక్కించుకున్నారు. 826 పాయింట్లతో గిల్ తన అగ్ర స్థానాన్ని కాపాడుకుంటే.. 791 పాయింట్లతో కోహ్లీ,769 పాయింట్లతో రోహిత్ శర్మ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. రెండో స్థానంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కొనసాగుతున్నాడు.
 
వరల్డ్ కప్ 2023 టోర్నీలో కోహ్లీ మూడు సెంచరీలు, 6హాఫ్ సెంచరీలతో 765 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ 597, గిల్ 354 పరుగులు చేశారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. సెమీస్, ఫైనల్లో ఈ హైదరాబాద్ పేసర్ విఫలం కావడంతో అగ్ర స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్, ఆస్ట్రేలియా స్పిన్నర్ జోష్ హేజల్ వుడ్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
 
బుమ్రా నాలుగో స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ 7, షమీ 10 వ స్థానంలో నిలిచారు. టీమిండియాలో నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు టాప్-10 లో నిలిచారు. ఇక ఫైనల్లో ఆసీస్ చేతిలోఓడిపోయినా వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)