ప్రస్తుతం టీమిండియా బ్యాటర్ల జోరు మాములుగా లేదు. ముఖ్యంగా టాపార్డర్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ లో అదరగొట్టేస్తున్నారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు టాప్-10 లో స్థానం సంపాదించారు. వరల్డ్ కప్ కు ముందువరకు ఈ ముగ్గురు టాప్-10 లో ఉండగా తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో వీరి స్థానాలను నిలుపుకున్నారు.
వరల్డ్ కప్ లో రోహిత్(719) ఆడిన మూడు మ్యాచుల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేసి 6 స్థానంలో నిలిస్తే.. విరాట్ కోహ్లీ(711) రెండు హాఫ్ సెంచరీలు చేసి 8 వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచులు ఆడకపోనా గిల్(818) తన రెండో స్థానంలోనే ఉండడం విశేషం. నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న బాబర్ అజామ్ విఫలమవడం గిల్ కి కలిసి వచ్చింది.
ఈ లిస్టులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 836 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే సిరాజ్ మూడో స్థానానికి పడిపోగా.. కుల్దీప్ యాదవ్ 8 వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ హాజెల్ వుడ్ 660 పాయింట్లతో టాప్ లో ఉన్నాడు. ఇక టీం ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది.