
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేసింది ఐసీసీ. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టోర్నీ జరగనుంది. ఒమన్ తో పాటు యూఏఈలో మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 17 నుంచి 22 వరకు రౌండ్ 1 మ్యాచ్ లు జరగనున్నాయి.
సూపర్ 12 మ్యాచ్ లు అక్టోబర్ 23న నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్ అక్టోబర్ 23న ఆస్ట్రేలియా ,సౌతాఫ్రికా మధ్య జరుగుతుండగా.. 24న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సారి టోర్నీలో భారత్ పాక్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. నవంబర్ 10న తొలి సెమీఫైనల్,11న రెండో సెమీఫైనల్, నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.