ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ల జోరు కొనసాగుతుంది. స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో జో రూట్, హ్యారీ బ్రూక్ అదరగొట్టారు. నాటింగ్ హోమ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇద్దరూ సెంచరీలతో సత్తా చాటారు. దీంతో టెస్టుల్లో వీరి ర్యాంకు లు మెరుగయ్యాయి. రూట్ 852 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు హ్యారీ బ్రూక్ 771 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ 859 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్, విలియంసన్ కు మధ్య కేవలం 7 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. దీంతో విలియంసన్ టాప్ ర్యాంక్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వెస్టిండీస్ తో జరగబోయే చివరి టెస్టులో రూట్ మరో సెంచరీ కొడితే టాప్ ర్యాంక్ లోకి వస్తాడు. టీమిండియా తరపున ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ వరుసగా 7,8,10 స్థానాల్లో నిలిచారు.
బౌలింగ్ విషయానికి వస్తే టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ (870) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుమ్రా (847) మూడో స్థానంలో.. జడేజా(788) ఏడో స్థానంలో ఉన్నారు. టీమ్స్ లో ఆస్ట్రేలియా (124) అగ్ర స్థానంలో.. ఇండియా(120) రెండో స్థానంలో ఉన్నాయి.
🔸 Joe Root closes in on top
— ICC (@ICC) July 24, 2024
🔸 Harry Brook attains career-high rating
🔸 Namibia stars rise
The weekly ICC Men's Player Rankings update is out 👉 https://t.co/IKhcNpT8zR pic.twitter.com/y8waWapyoB