ఐసీసీ టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌లో బుమ్రా, జడేజా, జైస్వాల్‌‌‌‌

ఐసీసీ టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌లో బుమ్రా, జడేజా, జైస్వాల్‌‌‌‌

దుబాయ్‌‌‌‌ : టీమిండియా ప్లేయర్లు జస్‌ప్రీత్‌‌‌‌ బుమ్రా, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్‌‌‌‌కు.. ‘ఐసీసీ టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌–2024’లో చోటు దక్కింది. ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా  ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌‌‌‌ నుంచి నలుగురు, న్యూజిలాండ్‌‌‌‌ నుంచి ఇద్దరు ప్లేయర్లను ఐసీసీ టీమ్‌‌‌‌లోకి ఎంపిక చేసింది. గతేడాది బుమ్రా14.92 యావరేజ్‌‌‌‌తో అత్యధికంగా 71 వికెట్లు తీశాడు. బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీలోనే బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు. 

ఇక జడేజా 527 రన్స్‌‌‌‌, 48 వికెట్లు తీశాడు. జైస్వాల్‌‌‌‌ గతేడాది రెండు డబుల్‌‌‌‌ సెంచరీలతో కలిపి 712 రన్స్‌‌‌‌ సాధించాడు. ఐసీసీ మెన్స్‌‌‌‌ వన్డే టీమ్‌‌‌‌లో మాత్రం ఇండియా నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లో మాత్రం స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ  చోటు దక్కించుకున్నారు. 

ఐసీసీ టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌ : కమిన్స్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), జైస్వాల్‌‌‌‌, డకెట్‌‌‌‌, విలియమ్సన్‌‌‌‌, రూట్‌‌‌‌, హ్యారీ బ్రూక్‌‌‌‌, కమిందు మెండిస్‌‌‌‌, జెమీ స్మిత్‌‌‌‌, జడేజా, మ్యాట్‌‌‌‌ హెన్రీ, బుమ్రా. వన్డే టీమ్‌‌‌‌: అసలంక (కెప్టెన్‌‌‌‌), సైమ్‌‌‌‌ అయూబ్‌‌‌‌, గుర్బాజ్‌‌‌‌, పాథుమ్‌‌‌‌ నిశాంక, కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌, షెర్ఫానే, ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌, వానిందు హసరంగ, షాహీన్‌‌‌‌ ఆఫ్రిది, హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌, ఘజాఫ్నర్‌‌‌‌. విమెన్స్‌‌‌‌ వన్డే టీమ్‌‌‌‌: వోల్‌‌‌‌వర్త్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), మంధాన, చామరి ఆటపట్టు, హీలీ, కాప్‌‌‌‌, గార్డ్‌‌‌‌నర్‌‌‌‌, సదర్లాండ్‌‌‌‌, అమీ జోన్స్‌‌‌‌, దీప్తి శర్మ, ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌, కేట్‌‌‌‌ క్రాస్‌‌‌‌.