Champions Trophy 2025: భారత్ స్థానంలో శ్రీలంక..? ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా ఔట్..?

Champions Trophy 2025: భారత్ స్థానంలో శ్రీలంక..? ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా ఔట్..?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ కు వెళ్తుందా లేదా అనే విషయం ఒక కొలిక్కి రావడం లేదు. బీసీసీఐ భారత క్రికెట్ జట్టును పాక్ కు పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇదే విషయాన్ని త్వరలో ఐసీసీతో చర్చించనుంది. భారత్ పాకిస్థాన్ కు వెళ్లకపోతే హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు జరుగుతాయి. దీని ప్రకారం భారత్ మ్యాచ్ లు శ్రీలంక లేదా దుబాయ్‌లో జరుగుతాయి. 2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగితే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించారు.  

ALSO READ | లంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు

ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఖచ్చితంగా పాక్ గడ్డపై అడుగుపెట్టాలని భావిస్తే మాత్రం బీసీసీఐ ఏం చేస్తుందనేది పెద్ద ప్రశ్నర్థకంగా మారింది. బీసీసీఐ పాకిస్తాన్‌కు టీమిండియాను పంపకపోతే.. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకు భారత్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పాక్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. భారత్ ఒప్పుకోకపోతే ఆ స్థానాన్ని ఐసీసీ శ్రీలంకతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయట. పలువురు పాకిస్థానీ జర్నలిస్టులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. 

ALSO READ | Big Bash League 2024: ఐపీఎల్ తర్వాత అతి పెద్ద లీగ్.. బిగ్ బాష్ షెడ్యూల్ ప్రకటన

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందని.. మార్పు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే మరో ఏడు నెలల సమయం ఉండటంతో.. దౌత్యపరమైన చర్చల తర్వాత ఇండియా పాకిస్తాన్ వెళుతుందా లేదా అనేది వేచి చూడాలి.

పాక్ వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ.. ప్రతిపాదిత షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేశారు. దీని ప్రకారం గ్రూప్ ఏ లో  పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్,న్యూజిలాండ్.. గ్రూప్ బి లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆడతాయి. 

ALSO READ | ENG vs WI 2024: టెస్టుల్లో స్టోక్స్ అరుదైన ఘనత.. దిగ్గజాల సరసన ఇంగ్లాండ్ కెప్టెన్

ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌ను మూడు వేదికల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో కరాచీ, రావల్పిండి, లాహోర్ ఉన్నాయి. ఈ టోర్నీ మొదటి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్‌తో న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత జట్టు లాహోర్ వేదికగా ఫిబ్రవరి 20 న బంగ్లాదేశ్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎదరు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ మార్చి 1న లాహోర్‌ వేదికగా తలపడనున్నట్లు తెలుస్తోంది.