ODI World Cup 2027: 2027 వన్డే వరల్డ్ కప్‌కు 14 జట్లు.. మెగా టోర్నీ పూర్తి వివరాలు ఇవే

భారత్ వేదికగా ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ 2023 జరుగుతున్న సంగతి తెలిసిందే. లీగ్ మొదలై నెల రోజులు గడిచిపోయింది. మరో రెండు వారాల్లో వరల్డ్ కప్ ముగుస్తుండగా అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పేసింది. 2027 వన్డే ప్రపంచ కప్ వివరాలను ప్రకటించి క్రికెట్ లవర్స్ ను ఖుషీ చేసింది. ఈ మ్యాచ్ లు ఎక్కడ జరుగుతాయో దీని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

2027 వరల్డ్ కప్ లో ఈ సారి మొత్తం 14 జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ మెగా టోర్నీ 2003 తరహాలో జరుగుతుందని స్పష్టం చేసింది. మొత్తం 14 జట్లు రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. గ్రూప్-ఏ లో ఏడు జట్లతో పాటు గ్రూప్-బి మరో ఏడు జట్లు లీగ్ మ్యాచ్ లు ఆడతాయి. రెండు గ్రూప్స్ లో టాప్- 3 లో నిలిచిన సూపర్-6 కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ లో ఒక్కో టీం మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున మొత్తం 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. టాప్- 4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక సెమీ ఫైనల్ లో గెలిచిన జట్లు రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి. 

ఈ మెగా టోర్నీకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిధ్యమివ్వనున్నాయి. హోస్ట్ కాబట్టి ఈ జట్లు నేరుగా వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి. వీటితో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్-8 లో నిలిచిన జట్లు ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అవుతాయి. మిగిలిన స్థానాల కోసం మిగతా జట్లు వరల్డ్ కప్ క్వాలిఫై మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.