ICC Rankings: బాబర్‌ను తొక్కేశాడు.. నెంబర్.1 వన్డే బ్యాటర్‌గా ‘గిల్’

ICC Rankings: బాబర్‌ను తొక్కేశాడు.. నెంబర్.1 వన్డే బ్యాటర్‌గా ‘గిల్’

భారత యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనపరిచిన గిల్.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాంను కిందకు నెట్టి, నెంబర్.1 ర్యాంక్‌ను అధిరోహించాడు. 

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డే సిరీస్‌లో గిల్ దుమ్మురేపాడు. రెండు అర్ధ సెంచరీలు(87, 60), ఒక సెంచరీ(112) చేశాడు. 86.33 సగటుతో మొత్తంగా 259 పరుగులు సాధించాడు. మరోవైపు బాబర్ ప్రదర్సన ఇటీవల కాలంలో అంతంత మాత్రమే. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన ట్రై సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో కలిపి 62 పరుగులు చేశాడు. అందువల్ల భారత ఓపెనర్.. వెనకుండి పోయాడు. ప్రస్తుతం గిల్ ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఇది రెండో స్థానంలో ఉన్న బాబర్ కంటే 23 పాయింట్లు ఎక్కువ.

Also Read :- స్టార్ క్రికెటర్లకు అగ్రెస్సివ్ నెస్ లేదు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్.. బాబర్‌ను కిందకు నెట్టి నెంబర్.  స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది రెండోసారి.

ఆమ్లా రికార్డుపై గురి..!

మరోవైపు శుభ్‌మాన్ గిల్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కొత్త రికార్డుల కోసం సిద్ధమవుతున్నాడు. ఇతగాడు మరో 413 పరుగులు చేస్తే, వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించొచ్చు. ప్రస్తుతానికి గిల్ 50 వన్డేల్లో 60.16 సగటుతో 2587 పరుగులు చేశాడు.