ODI World Cup 2023: రేపటి నుంచే వరల్డ్ కప్ సమరం.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కి కౌంట్  డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు నెలలు, రోజులు ఎదురు చూసిన అభిమానులు ఇక గంటలు లెక్కపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో భారీ హైప్ నెలకొంది. ఈ మ్యాచుని చూడడానికి ఇప్పటికే స్టేడియంలు అన్ని నిండిపోనున్నాయి. ఇక ఇంట్లో కూర్చొని ఈ మ్యాచులు ఎక్కడ చూడాలో ఇప్పుడు చూద్దాం. 

ప్రత్యక్ష ప్రసారం ఎందులోనంటే..?

సాధారణంగా భారత్ లో క్రికెట్ మ్యాచులను ఎప్పటి నుంచో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ సారి కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లైవ్ అందించాడికి రెడీగా ఉంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3 లలో ఈ మ్యాచులను వీక్షించవచ్చు. డిడి స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ ప్రసారమవుతుంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే మొబైల్స్ లో ఈ మ్యాచుని   డిస్నీ+ హాట్‌స్టార్ లో ఫ్రీగా చూడవచ్చు.  

రేపటి నుంచే వరల్డ్ కప్ సమరం 

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతాయి. రేపు జరగనున్న తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో రన్నరప్ న్యూజీలాండ్ తలపడబోతుంది. నవంబర్ 19 న వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచులకి కూడా గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. ఇక  భారత్ విషయానికి వస్తే అక్టోబర్ 8 న ఆస్ట్రేలియాతో చెన్నైలో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14 న జరగనుంది.