ICC ODI World Cup 2023: టీమిండియా మ్యాచ్‌లు, వేదికలు పూర్తి వివరాలివే

అభిమానులు ఉత్కంఠకు తెరపడింది. కొద్దిసేపటి క్రితమే ఐసీసీ.. వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వడానికి సరిగ్గా 100 రోజుల సమయముంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుండగా.. నవంబర్ 12న పూణే వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ స్టేజ్ ముగియనుంది.

లీగ్ దశలో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్‌లు ఆడనుంది. చెన్నై వేదికగా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్తాన్‌తో, అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో‌  తలపడనుంది. ఆ తరువాత అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో, అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. 

ALSO READ:ఇష్టం లేకుండా ఎలా పట్టుకుంటావ్? మండిపడుతున్న నెటిజన్స్ 

టీమిండియా వరల్డ్ కప్ - 2023 మ్యాచ్‌లు, వేదికలు 

  • అక్టోబర్ 8: ఇండియా vs ఆస్ట్రేలియా( చెన్నై)
  • అక్టోబర్ 11: ఇండియా vs   ఆఫ్గనిస్తాన్ ( ఢిల్లీ)
  • అక్టోబర్ 15: ఇండియా vs  పాకిస్తాన్ (అహ్మదాబాద్)
  • అక్టోబర్ 19: ఇండియా vs  బంగ్లాదేశ్( పూణె)
  • అక్టోబర్ 22: ఇండియా vs  న్యూజిలాండ్( ధర్మశాల)
  • అక్టోబోర్ 29: ఇండియా vs  ఇంగ్లండ్( లక్నో)
  • నవంబర్ 2: ఇండియా vs   క్వాలిఫయర్ 2( ముంబై)
  • నవంబర్ 5: ఇండియా vs  సౌతాఫ్రికా( కోల్ కతా)
  • నవంబర్ 11: ఇండియా vs  క్వాలిఫయర్ (బెంగళూరు)